ప్రేమ

ఎన్ని గడులు నింపితే

ఈ ప్రహేళిక పూర్తవుతుంది?

ఏ ప్రశ్నలకి

జవాబులు దొరికితే

ఈ పరీక్ష ముగుస్తుంది?

 

ఎన్నాళ్ళు, ఎన్ని నీళ్ళు

తోడితే

ఈ తొట్టె నిండుతుంది?

ఏ ఉపవాస దివసావసాన

చంద్రోదయం వేళ

జల్లెడలోంచి

ప్రేమ జారుతుంది?